రాబోయే రోజుల్లో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్. ప్రపంచంలో భారత్ ఎదుగుదలలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఇర్ఐ) 61వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమల కారణంగా ప్రతి ఒక్కరూ భారత్ వైపు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే భారత్ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు.