ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరెస్టు తర్వాత మొదటిసారిగా ఒంగోలు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్ర ముఖులు కలిసి పరామర్శించారు. స్థానిక రామనగర్‌లోని మాగుంట కార్యాల యంలో శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, వి విధ వర్గాల ప్రజలు శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, అదేవిధంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వీ.సుబ్బారావు మాగుంటను కలిసి పరామర్శించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులు ఆయనను కలిసి ధైర్యం చెప్పారు.