ఫోన్‌పే ఖాతా నుంచి రూ.90 వేలును ఓ వ్యక్తి చోరీ చేసిన ఘటన పొదిలి జూనియర్ కళాశాల రోడ్డు చిల్లర దుకాణం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే... స్థానికంగా కొల్లా వెంకటసుబ్బారావు అనే వ్యక్తి చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణానికి ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి వచ్చాడు. రూ.3వేలకు వివిధ సరుకులు కట్టాలని చెప్పాడు. కావలసిన వస్తువులు దుకాణదారుడు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తమ స్నేహితుడి ద్వారా ఫోన్‌పేలో నగదు పంపిస్తానని చెప్పాడు. దుకాణదారుని మొబైల్ ద్వారా ఒక్క రూపాయి కొట్టాలని కోరాడు. దానికి అంగీకరించిన దుకాణదారుడు రూపాయికొట్టే క్రమంలో సీక్రెట్ నెంబర్ గమనించాడు. ఎంతసేపటికి అమౌంట్ రాకపోవడంతో సరుకులు కట్టడం అయిపోయిందని డబ్బులు ఇంకా రాలేదని వచ్చిన వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వండి స్నేహితుడికి మెసేజ్ చేస్తానని చెప్పి దుకాణదారుడి మొబైల్ తీసుకొన్నారు. ఆయన ఖాతాలో ఉన్న రూ.90వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకొన్నాడు. తన స్నేహితుడు అమౌంట్ పంపించలేదు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తెస్తానని అక్కడి నుంచి ఉడాయించాడు. దుకాణదారుడు. ఆతరువాత చాలా సేపటికి ఫోన్ చూసుకోగా నగదు వేరే అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేసుకొని దుండగుడు వెళ్లిపోయినట్లు గమనించామనించాడు.