హైస్కూల్ స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పరచుకొన్నపుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కృష్ణా జిల్లా, విద్యా శాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు. శుక్రవారం బాపులపాడు జడ్పీ హైస్కూ ల్‌ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. 3,4,5 తరగతలు విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాకానుక వస్తువులను సక్రమంగా వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన కృషి చేయాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. ఏఏ సబ్జెక్టులకు ఎన్ని రోజులు కేటాయించాల్సింది వివరించారు. మంచి ఫలితాలు సాధిస్తామని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. మంచి ఫలితాలు సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు హెచ్‌ఎం టీవీ నాగేశ్వరరావుతో పాటు వేలేరు, కానుమోలు, ఆరుగొలను, రేమల్లె, వీరవల్లి పాఠశాలల హెచ్‌ఎంలు కె.విజయ్, లూధర్‌పాల్, ఝాన్సీలక్ష్మి, సుబ్బారావు, సుదర్శనం తదితరులు ఉన్నారు.