రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విధానాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు చెప్పారు. ప్రజావ్యతిరేక కేంద్రబడ్జెట్‌ను నిరసిస్తూ విజయవాడ వన్‌టౌన్ హెడ్‌పోస్టాఫీసు వద్ద శుక్రవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అత్యంత నిరాశాజనకంగా కేటాయింపులున్నాయని. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నా రు. సబ్సిడీలలో కోతలు, ఉపాధి కల్పనకు లేని కేటాయింపులు, సంక్షేమ పథకాలను కుదించే చర్యలు, ప్రభుత్వరంగంలో వాటాల అమ్మకాలు ఇలాంటివన్నీ సరికాదన్నారు. పాలు, పెరుగుపై జీఎ్‌సటీ విధించారని, దేశ సంపదంతా తమవద్దే ఉంచుకున్న అంబా నీ, ఆదానీ వంటివారిపై పన్నులు విధించకుండా పె ట్రోల్, డీజిల్‌పై పన్నులు వేస్తున్నారన్నారు.