అనంతపురం జిల్లా, కుడేరు మండల పరిధిలోని ఏ నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రఘు, అపర్ణ భార్యభర్తలు పురుగులు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఇంట్లో పురుగుల తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గమనించిన బంధువులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ సత్యనారాయణను సంప్రదించగా దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందన్నారు. అయితే వారిద్దరు అపస్మారకస్థితిలో ఉన్నారని వారు ఆరోగ్యపరిస్థితి మెరుగుపడితే వివరాలు తెలుస్తాయన్నారు.