కనిగిరిలో తాగునీటికి కటకట ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. ఒప్పంద గడువు ముగియడంతో ఐదు రోజులుగా కాంట్రాక్టరు నీటి సరఫరాను ఆపివేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నీటి సరఫరా బిల్లులు చెల్లించడం లేదు. దాదాపు రూ.5కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. పాలకులు, అధికారులు కొత్తగా టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు.