టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)నోరు పారేసుకున్నారు. ఏ పోలీసుకైనా తిక్కరేగితే చంద్రబాబును కాల్చి పారేస్తాడు’ అంటూ రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశారు. గూగుల్ టేకౌట్కు సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు?.. ఓ టెలిఫోన్ ఆపరేటర్ ఎంక్వయిరీ చేస్తే సరిపోతుంది’ అని అన్నారు. ‘ఎవ్వడి ఫోన్ ఎవడికి వెళ్లిందో.. చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, ఆదినారాయణరెడ్డి, వివేకానందరెడ్డి బావమరుదుల ఫోన్లను చెక్ చెయ్యరా?’ అని సీబీఐని నాని ప్రశ్నించారు. ‘గన్నవరంలో చంద్రబాబు.. సీటు తగులబడ్డ కారును పరిశీలించాడు. భద్రతా సిబ్బందిని వదిలేసి కొట్టుకుందామా అని జగన్ను చంద్రబాబు ప్రశ్నించడం ఏమిటి?’.‘అధికారంలోకి వస్తే తాట తీస్తానంటూ పోలీసులను చంద్రబాబు బెదిరిస్తున్నాడు. కానీ, ఎవ్వడికైనా తిక్కరేగితే.. ఒడిసాలో మంత్రిని కాల్చినట్లు కాల్చేస్తాడు. అలా కాల్చేస్తే దాన్ని కూడా జగన్ మీదకే నెట్టేస్తారు’ అని నాని అన్నారు.