రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేయడానికి అవకాశం లేదా..? అని యనమల ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో..అందరి హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలను ప్రశ్నిస్తోందని, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యడానికేనని, ప్రతిపక్షాలను అణిచివేయడానికి కాదని అన్నారు. తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రూ. లక్ష కోట్లు అవినీతి చేసారని అన్నారు. అక్రమ ఆర్జనతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారుని విమర్శించారు.