ప్రభుత్వ ఉద్యోగి ఒకరు జీతం రాక లోన్ యాప్ల బారిన పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర దుస్థితికి దర్పణమన్నారు. ఒంగోలు బాలికల ఐటీఐ కళాశాలలో జూనియర్ అసిస్టెంటుగా చేస్తున్న నాగభూషణాచారికి సకాలంలో ప్రభుత్వం నుంచి జీతం అందక అవసరాల కోసం లోన్ యాప్ల నుంచి రుణం తీసుకొన్నాడు. తర్వాత వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేయడంపై వార్త ప్రచురితం అయింది. దీనిపై చంద్రబాబు శనివారం ట్వీట్ చేశారు.