ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఓ మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్ళితే.... కర్నూలు జిల్లా, పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన హనుమప్ప అనే వ్యక్తి మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన రంగడు, మహేష్‌లు సహకారం అందించారు. వీరందరిపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్‌రాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa