ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును దొంగిలించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 02:58 PM

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని, సీఎం జగన్‌ తన దుర్మార్గపు పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును దొంగిలించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం దేఽశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. జైభీమ్‌ భారత్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ పోరు - బడ్జెట్‌ తీరు’ అనే అంశంపై విజయవాడలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని చెప్పి నిరుద్యోగులను జగన్‌ మోసం చేశారని శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. 6.5లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జైభీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 1నుంచి గడపగడపకు దగా ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1500 మంది పైన జరిపిన హింసాకాండను వివరిస్తూ 56 పేజీలతో ముద్రించిన పుస్తకాన్ని సమావేశంలో ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com