కర్నూల్ జిల్లాలోని ఆదోని మండలంలో తెల్లవారుజామున రోజు వెళ్లినట్లుగానే వాకింగ్ వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందాడు. ఇటీవలే వివాహ నిశ్చితార్థం కావడం..ఇంతలోనే ఇలా విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.