మెకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దీనిలో రోబోటిక్ శస్త్రచికిత్స ఒకటని చెన్నై అపోలో ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ మదన్ మోహన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఒంగోలులోని అపోలో ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు అపోలోలో ఈ రోబోటిక్ సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. నెల్లూరులో రోబోటిక్ శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న రోగులను మీడియాకు ఆయన పరిచయం చేశారు. ఈ చికిత్స వల్ల ఖచ్చితత్వంతోపాటు రోగికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కోత, నొప్పి తక్కువగా ఉంటుందని.. త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఈ విధానంలో ముందుగా కంప్యూటర్‌లో 3డీ నమూనాను రూపొందించుకుని ఈ తర్వాత రోగి సిటీస్కాన్ ఆధారంగా ఏ భాగంలో చికిత్స చేయాలో రోబోటిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.