పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం మిరియాల గ్రామంలో శుక్రవారం జరిగిన ట్రాక్టర్ దహనం సంఘటనను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఇనచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని ర్యాలీగా తీసుకు వచ్చిన టీడీపీ కార్యకర్త బత్తుల ఆవులయ్యకు చెందిన ట్రాక్టర్‌ను వైసీపీ నాయకులు తగల బెట్టడం వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఇవన్నీ జరగటం చూస్తుంటే మాచర్లలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కన్పించటం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు.