రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఇంటి నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.31 లక్షలు ఇస్తామని చెప్పి నేటి వరకు పూర్తికాని పరిస్థితి ఉందని సీపీఐ నేతలు ఆరోపించారు. ఉగాది పర్వదినాన.. ఐదు లక్షల ఇల్లు లబ్ధిదారు లకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1, 80, 000వేల రూపాయలు గృహ నిర్మాణ కి ఏమాత్రం సరిపోవు. కనీసం లబ్ధిదారునికి 5. లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా మీరు ఇచ్చే ఒక సెంటు దేనికి కాదు ప్రతి ఒక్కరికి 2. సెంట్లు ఇవ్వాలని, 90 శాతం పూర్తి అయిన టీడ్కో ఇళ్ల నిర్మాణము వేగవంతం చేసే వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని.. గత రెండు నెలలుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రౌండ్ టేబుల్ సమావేశాలు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టడం జరిగింది. మార్చి 2. 3. 2003. తారీఖున విజయవాడలో జరుగు మహా ధర్నాకు రాయదుర్గం నియోజకవర్గం నుండి అన్ని మండలాల్లో లబ్ధిదారులు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు అంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అంజి, సీపీఐ నాయకులు తిప్పేస్వామి, దుర్గన్న, నాగరాజు నిరంజన్ రెడ్డి, రామాంజనేయులు, లక్ష్మన్న, శీను పాల్గొన్నారు.