శ్రీసత్యసాయి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, తెలుగు మహళలు, కార్యకర్తల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సీఐ మధు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలోశ్రీసత్యసాయి జిల్లాటి డిపిఅద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బి. కె. పార్థసారధి ఆదేశాల మేరకు జిల్లా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల దృశ్య గుడి ప్రాంగణ వీధుల్లో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారస్తుల తాత్కాలిక దుకాణాల తొలగింపులో భాగంగా కదిరి పట్టణ సీఐ మధు స్థానిక మహిళా కౌన్సిలర్ పై దుర్భాషలాడి దాడి చేయడన్ని నిరసిస్తూ నిన్న రాత్రి సీఐ ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల పై లాఠి చార్జి చేయడమే కాక సత్య సాయి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, తెలుగు మహిళల, కార్యకర్తల పైన కూడ దాడి చేయడం జరిగిందని తెలిపారు.
ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే సిఐ మధు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ వైకాపా తొత్తు ల వ్యవహరిస్తున్నాడని, తక్షణమే సీఐ మధు పై చర్యలు తీసుకోవాలని , దాడి గురైన వ్యక్తులకు న్యాయం చేయాలని సత్యసాయి జిల్లా తెలుగు యువత తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుల్లప్ప చౌదరి , సత్య సాయి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావిధ్ బాషా, మైనార్టీ నియోజక వర్గ అద్యక్షులు రియాజ్ బాషా, టి ఎన్ ఎస్ ఎఫ్ షబ్బీర్ భాషా, తెలుగు యువత ప్రశాంత్, ఉపేంద్ర చౌదరి, సాధిక్, రఫీ పాల్గొన్నారు.