చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ బతుకు సాగిస్తున్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మెదరమెట్లలో లోకల్ యాప్ తో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు గ్రాట్యూటి అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని ఆంజనేయులు కోరారు. పాదయాత్ర లో అంగన్వాడీలకు ఇచ్చిన మాటలు ముఖ్య మంత్రి నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.