బ్లూటూత్ తో సైబర్ నెరగాళ్లు మాయ చేసి మోసాలకు పాల్పడుతున్నారని మద్దిపాడు ఎస్సైశ్రీరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్ నందు లోకల్ యాప్ తో మాట్లాడుతూ బ్లూబగ్గింత్ తో స్మార్ట్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారని ఇలాంటి మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరిచయం లేని వ్యక్తులు బ్లూటూత్ ద్వారా పంపే పెయిరింగ్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని, పొరపాటున వాటిని కనెక్ట్ చేస్తే మొబైల్ లో ఉన్న డేటా మొత్తం చోరీ అవుతుందని ఎస్సై శ్రీరామ్ పేర్కొన్నారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ ల వద్ద ఉచిత వైఫై వినియోగించకూడదని ఆయన తెలియజేశారు.