ఎస్బిఐ వినియోగదారులకు సైబర్ నెరగాళ్లు మెసేజ్లు పంపుతున్నారని వాటిపై జాగ్రత్తగా ఉండాలని అద్దంకి పట్టణ సీఐ రోశయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ నందు ఆదివారం లోకల్ యాప్ తో మాట్లాడుతూ సైబర్ నెరగాళ్లు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటూ లింకులు పంపిస్తున్నారని అన్నారు. పొరపాటున ఆ లింకులపై క్లిక్ చేస్తే మన ఖాతాలో ఉన్న నగదు స్వాహా అవుతుందని సీఐ పేర్కొన్నారు. కావున తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు.