గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో దారుణం జరిగింది. చనిపోయిన చిన్నారిపై అత్యాచారం జరిగింది. థాన్ ప్రాంతానికి చెందిన ఏడాదిన్నర బాలికకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. అనారోగ్యంతో ఈ నెల 25న బాలిక చనిపోగా, అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత బాలిక మృతదేహం ఓ ప్రాంతంలో కనిపించింది. చిన్నారి ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.