ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సీతమ్మదార క్యాంప్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీతం రాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించే విధంగా నియోజక వర్గంలో ఉన్న పట్టపద్లను కలిసి మన పార్టీ అభ్యర్ధి నీ గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవిఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు 60 వ వార్డ్ కార్పొరేటర్ పి వి సురేష్ , 40 వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వర రావు, 62 వ వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణ రావు, 57 వ వార్డ్ కార్పొరేటర్ ముర్రు వాణీ నానాజీ, తదితరులు పాల్గొన్నారు.