అనకాపల్లి జిల్లా రాంబిల్లి నావెల్ గేట్ ఎదుట నిర్వాసితుల చేపట్టిన ధర్నా సోమవారం నాటికి 120 రోజుకు చేరుకుంది. అపరిస్కృతంగా ఉన్న సమస్యల పరిష్కరించాలని కోరుతూ 8 గ్రామాలకు చెందిన మత్స్యకారులు రైతులు నిర్వాసితులు పోరాటం సాగిస్తుండగా ఆయా గ్రామాల ప్రతినిధులతో జేఏసీ ఏర్పాటు చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటాన్ శెట్టి నేతృతంలో మత్స్యకార గ్రామాల ప్రతినిధులతో చర్చించేందుకు రెవిన్యూ డివిజనల్ అధికారి, ఎన్ఏఓబి డిప్యూటీ జాయింట్ కలెక్టర్, జిల్లా మత్స్యకార శాఖ అధికారితో కమిటీ ఏర్పాటు చేశారు. కాగా ప్రతినిధులతో చర్చలు జరిపి వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చే జీవనోపాధిపై మినిట్స్ రూపొందించి వినిపించారు. అదే సమయంలో కొత్తపేట, చినకలవలాపల్లి, కొప్పు గుండు పాలెం వాడపాలెం గ్రామాల సమస్యలపై సెకండ్ పేజ్ లో చర్చిస్తామంటూ అధికారులు తేల్చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు తమను సైతం మొదటి పేజ్ లోనే గుర్తించి సమస్యల పరిష్కరించి జీవనోపాధి కల్పించాలని కొత్తపేట గ్రామ సర్పంచ్ వానపల్లి వెంకట అరుణ లతా జగన్ మిగిలిన గ్రామాల ప్రజలు నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా 19 సమస్యలతో కూడిన వినతి పత్రాలు కేంద్ర మంత్రులకు జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించి జీవన భృతి అందజేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా శారదా నది వద్ద అనుకుని ఉన్న రజాల అగ్రహారం రెవెన్యూ పరిధిలో తమ ప్రాంత రైతులు సాగు చేస్తున్న భూములలో ఉప్పుటేరు కారణంగా వరద ఉధృతికి లోనై రెండు పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ సమస్యలను పరిష్కరించే వరకు నావెల్ గేట్ ఎదుట ధర్నా కొనసాగుతుందని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ప్రాంత రైతులు నిర్వాసితులు ను ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ వెంకట అరుణలత డిమాండ్ చేస్తున్నారు.