అచ్చుతాపురం: మండలంలో అక్రమ గ్రావెల్ దందాకు అడ్డు లేకుండా పోతుంది. పట్టపగలే దర్జాగా గ్రావెల్ తరలించి పోతున్నప్పటికి రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇటీవల జగన్నాధపురంలో కొండ పోరం స్థలం అక్రమంగా ఆక్రమించడంతో పాటు, గ్రావెల్ను కూడా అక్రమంగా తరలించేశారు. వారిపై చర్య తీసుకోకపోవడంతో అక్రమ గ్రావెల్ దందాదారులకు ధైర్యం పెరిగిపోయింది. ఉప్పవరం రెవిన్యూ పరిధిలో సోమవారం యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ను ఇతర ప్రాంతాలకు తరలించారు. రెవిన్యూ సిబ్బందిని అక్రమ గ్రావెల్ తరలింపు గురించి ప్రశ్నించగా గ్రావెల్ తరలింపును నిలుపుదల చేసామని సిబ్బంది చెప్పినప్పటికీ యధావిధిగా దర్జాగా గ్రావెల్ను తరలించుకుని పోతూనే ఉన్నారు. అక్రమ గ్రావెల్ తరలిపోతున్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది ఉండి ప్రయోజనం ఏమిటని ప్రజలు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు.