గుజరాత్ లోని జునాగఢ్ లో సమ్యక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఒకే రోజు 9 జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ వివాహ వేడుక బౌద్ధ సంప్రదాయం ప్రకారం జరగ్గా, నూతన వధూవరులు అంబేడ్కర్, గౌతమ బుద్ధుని ఫోటోలతో పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. వివాహం అనంతరం నూతన వధూవరులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. అయితే, ఈ పెళ్లిలో ఎక్కడా వరుడు, వధువుకు తాళి కట్టలేదు.