టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్‌గా నిలిచారు. టెస్లా షేర్లు రాణించడంతో ఆయన మళ్లీ తొలి స్ధానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ సూచీ ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన LVMHఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి మెుదటి స్థానంలో నిలిచారు.