కుక్క అరుస్తూ దగ్గరగా వస్తే కదలకుండా నిలబడండి. చేతులను శరీరానికి ఆనించి ఉంచండి. కుక్కను మిమ్ములను వాసన చూడనీయండి. వాసన చూసిన కుక్క సాధారణంగా నోరు తెరవకుండా వెళ్లిపోతుంది. ఒకవేళ కుక్క కరవడానికి దాడి చేస్తే ముడుచుకుని రాయిలా పడుకోండి. బంతిలా దగ్గరగా ముడుచుకుని ఉండండి. చేతులతో తల వెనుక పెట్టి మొహంపై కరవకుండా జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితిలోనూ కుక్కలపై రాళ్లు, కర్రలు విసరవద్దు.