ఏపీ ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల్ని అకౌంట్లలో జమచేసింది. రైతు భరోసా మూడో విడత కింద నిధులను గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 51.12 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో రూ. 1090.76 కోట్లు జమ అయ్యాయి. కాగా, ప్రభుత్వం రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.