శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, న్యామద్దల గ్రామాల్లో సోమవారం చోటు చేసుకుంది. ఆయా గ్రామాల్లో పొలాలకు సమీపంలోని బీడు భూముల్లో ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పు పెట్టారు. మంటలు తోటలకు వ్యాపించి చెట్లు కాలిపోయాయి. మేడాపురం గ్రామంలో సుజాతకు చెందిన పొలంలో కాపుకు వచ్చిన 150 మామిడి మొక్కలు, న్యామద్దల గ్రామంలో రైతు శ్రీరాములుకు చెందిన 60 మామిడి మొక్కలు, వరలక్ష్మి పొలంలోని 10 మామిడి, వీరనాగ మ్మకు చెందిన 20 మామిడి మొక్కలు, మరో ఇద్దరు రైతులకు చెందిన మామిడి, చింత చెట్లు కాలి పోయాయి. అగ్నిమాపక సిబ్బందితోపాటు చుట్టుపక్కల రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి నప్పటికీ ఫలితం లేకపోయింది. పండ్ల మొక్కలతోపాటు వ్యవసాయ పరికరాలు, మోటారు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఒక్క న్యామద్దల గ్రామంలోనే దాదాపు రూ. 10 లక్షల వరకు నష్టం వాటి ల్లినట్లు బాధిత రైతులు వాపోయారు.