మెడికో విద్యార్థి ప్రీతి నాయక్ మరణానికి కారకులను కటినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ముందు దారవత్ ప్రీతి నాయక్ మృతిపై జేఏసీ అధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. అనంతరం సాకే హరి మాట్లాడుతూ వైద్య విద్యార్థిని గిరిజన బిడ్డ దారవత్ ప్రీతి ర్యాగింగ్ విషకొరలకు బలైందని ఆవేదన చెందారు. సైఫ్ అనే విద్యార్థి వేధింపులకు గురిచేయడం వలనే ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఉన్నత విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలను విద్యార్థులను వివిధ రూపాల్లో హింస, వేధింపులకు గురిచేస్తూ పై శాషిక ఆనందం పొందుతున్నారని వాపోయారు. ఎంతకాలం ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తారని ఆవేదన చెందారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక న్యాయం అగ్ర వర్ణాలైతే ఇంకో న్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజంలోని సమూల మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమక్రసీ కిష్ట, మాల మహానాడు ఓబుళ రాజు, జేఏసీ నాయకులు రేకలకుంట రామాంజనేయులు, వరి కూటి కాటమయ్య, రామకృష్ణ, చెన్న కేశవ, పాల్త్యా గణేష్ నాయక్, ప్రతాప్, ముత్యాలమ్మ, శాంతమ్మతదితరులు పాల్గొన్నారు.