రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి కొరకు మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. దశాబ్దాల కాలం నుంచి వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసినారు. మంగళవారం జగదాంబ జంక్షన్ లో జరిగిన ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి సమావేశంలో ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ మాట్లాడుతూఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించారు. అనేక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను విశాఖపట్నం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరియు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కొరకు అనేక ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023 విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని విశాఖపట్నం తీసుకొచ్చి 11 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎంత ఒత్తిడిలు ఏర్పడిన విశాఖపట్నం పరిపాలన రాజధానికి కట్టుబడి ఉన్నారు .సీఎం జగన్ మోహన్ రెడ్డి అతి త్వరలో విశాఖపట్నం నుండి పరిపాలన చేయుటకు నిశ్చయించుకున్నారు. నిరంతరం విశాఖ అభివృద్ధి కొరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.