అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలంటే జంక్ ఫుడ్, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే ఆహారాన్ని తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఫోన్లు, టీవీలు చూస్తూ ఆహారం తినొద్దు. అర్ధరాత్రి తినడం, రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం వంటి అలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. ఇలాంటి అలవాట్లను కూడా దూరం చేసుకోవాలి.