శాకాహారులు గింజలు, చిక్కుళ్లు, ధాన్యాలు, విత్తనాలు, పప్పులు తినాలని, ఇవి తింటే ప్రొటీన్లతో పాటు అన్నిరకాల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, పాలకూర, పాలు తీసుకోవాలని చెబుతున్నారు. పన్నీర్, సోయా చంక్స్, మిల్మేకర్, సోయాబీన్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే సరైన ప్రొటీన్లు, విటమిన్లు శరీరానికి అందుతాయి. పండ్ల రసాలకు బదులు పండ్లు తింటే మంచిది.