రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తిరిగి అధికారం లోకి వచ్చే విధంగా గృహ సారథులు సమన్వయంతో పనిచేయాలని కొండేపి నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పిలుపు ఇచ్చారు. మంగళ వారం సింగరాయకొండ గ్రామ పంచాయితీ పరిధిలోని సుబ్బిరామి రెడ్డి కాలనీలోని గృహ సారథి షేక్ ఖాజా రసూల్ నివాసం లో ఏర్పాటు చేసిన గృహ సారథి తో కాఫీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.