రాజంపేట అత్తిరాల మడుగులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజంపేట ఎన్టీఆర్ నగర్ లో వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నాడు. సోమవారం నుండి ఉపాధ్యాయుడు కనపడలేదని కుటుంబీకుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అత్తిరాల మడుగు సమీపంలో వెంకటేశ్వర్లు కు చెందిన బట్టలు స్కూటీ లభించినట్లు స్థానికులు తెలిపారు. అతను వేసుకున్న బట్టలు కావడంతో అందులో ఆధార్ కార్డు గుర్తింపు కార్డులు బట్టి వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. చక్రాల మడుగులో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రమాదవశాత్తు మరణించాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి స్థానిక మహిళా పోలీసు. చేరుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.