ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్ల సమన్వయ సమావేశంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు చిట్వేల్ పట్టణ ఆర్. కె కళ్యాణ మండపం నందు జరిగే సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరవుతారని రైల్వే కోడూరు లోని ప్రభుత్వ విప్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. చిట్వేల్ మండలంలోని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్లు ఈ సమన్వయ సమావేశానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో కోరారు.