గడప గడపకు మన ప్రభుత్వం పూర్తయిందని, ఈ స్పూర్తితో త్వరలో నియోజకవర్గంలో త్వరలో జగనన్న పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 213 రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలోని 41 వార్డులు, 2 మండలాలలోని 30 పంచాయతీలు, 49 గ్రామాలలో విజయవంతంగా నిర్వహించామన్నారు. మున్సిపల్ పరిధిలో చెప్పుకోదగ్గ సమస్యలు రాలేదని, అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామాల్లో మురుగునీటి కాలువలు, వీధి దీపాలు తదితర సమస్యలు పరిష్కారించాల్సి ఉందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి పాల్గొన్నారు.