బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని వరుణ్ హైస్కూల్ నందు మంగళవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ వెలిచెర్ల వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. సివి రామన్ రామన్ఎఫెక్ట్ అనే ప్రయోగానికి గాను ఆయన నోబెల్ బహుమతి పొందుకోడం జరిగింది. కనుక ఆయనను జ్ఞాపకముగా మనము సైన్స్ డే ని జరుపుకుంటున్నాం, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంపై అభివృద్ధి పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థులందరూ సైన్స్ ప్రాజెక్ట్లు ఎంతో అందంగా చక్కగా తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రణయ్ కుమార్, సైన్సు ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, కళ్యాణి ఇతర ఉపాధ్యాయులు, రామయ్య, నాగార్జున రవికాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంధ్య, రమాదేవి, శ్రావణి, ఐశ్వర్య పాల్గొన్నారు.