మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం సాయుధ దళాల పతాక నిధికి తిరుపతి జిల్లా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది బుధవారం రూ. 3, 05, 353 విరాళంగా ఇచ్చారు. చెక్కును డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, వారి సిబ్బందితో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ శంకర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.