శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ హుండీ ఆదాయం 21 రోజులకు రూ. 1. 37 కోట్లు వచ్చింది. ఆలయంలోని గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద బుధవారం హుండీలు లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా 0. 116 గ్రాముల బంగారం, వెండి 334. 900 కిలోలు లభించాయి. విదేశీ కరెన్సీ 89 నోట్లు వచ్చాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.