ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన హక్కుల సాధనకై ఉద్యమిద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 10:14 AM

గిరిజనులంతా ఏకమై ఐక్యమతతో ఉండి గిరిజన హక్కుల సాధనకై ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్ అధ్యక్షతన నంద్యాల జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హాజరై ఆయన చేతుల మీదుగా కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్న గిరిజనులకు బలోపేతం చేయడమే లక్ష్యంగా, గిరిజనుల అభ్యున్నతికి మరింత ముందుకు సాగేందుకు జిపిఎస్ కృషి చేస్తుందని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com