భార్యపై అనుమానంతో ఆమెను 11 ఏళ్ల పాటు ఒకే చీకటి గదికి పరిమితం చేశాడు ఓ లాయర్. విజయనగరంలో లాయర్‌గా పని చేస్తున్న గోదావరి మధుసూదన్ తన భార్యను పదకొండేళ్ల నుంచి బయట ప్రపంచానికి చూపించలేదు. చివరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. సెర్చ్ వారెంటుతో బుధవారం పోలీసులు మధుసూదన్ ఇంటిని తనిఖీ చేశారు. చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు.