ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పురుషుడు గర్భాశయంతో జన్మించాడు. ఓ 30 ఏళ్ల వ్యక్తి పురుష, స్త్రీ పునరుత్పత్తి భాగాలతో జన్మించినట్లు అమృతా హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. అతను పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS) అనే అరుదైన జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడని కనుగొన్నారు. అతనికి మినిమల్లీ ఇన్వాసివ్ రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స అందించారు.