రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. జాలోర్ జిల్లాలో శంకర్లాల్, బగ్లి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్థలు రావటంతో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నర్మద కెనాల్ వద్దకు భార్య, ఐదుగురు పిల్లలతో సహా వెళ్లిన శంకర్, అనంతరం అందరూ కలిసి అందులో దూకేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయ సిబ్బందితో మృతదేహాల కోసం గాలిస్తున్నారు.