ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ లెవెల్-1, లెవెల్-2 ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు తుది గడువు 22-03-2023. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://iocl.com/latest-job-opening వెబ్సైట్ను సందర్శించగలరు.