లింగాల గ్రామంలో వీధుల గుండా నడవాలంటే గ్రామ సింహాల ను దాటుకుని వెళ్లాల్సిందే. పొరపాటున ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నామో. వాటి దాడికి బలిఅవ్వాల్సిందేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూళ్లకు, ప్రజలు ముఖ్యంగా ఆడవారు పనులకు వెళ్ళాలంటే భయం భయంగా ఉంది. పగలు రాత్రి అని తేడా లేకుండా అన్ని వేళల్లో వీటికి భయపడుతూ వెళ్ళవలసి వస్తుంది. ఇక బైక్ పై వెళ్ళే వారిపైకి అమాంతంగా వచ్చి దాడికి యత్నిస్తున్నాయి అవి మొరుగుతూ మీదికి రావడంతో భయంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. దయచేసి సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్నేహిత అమృత హస్తం సేవా సమితి బృందం వారు కోరుతున్నారు.