బ్రహ్మంగారిమఠం మండలంలోని పరిధిలోనే మల్లెపల్లె బైపాస్ రోడ్డు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉద్దేశించి మండల ఎన్నికల ప్రత్యేక అధికారులు పంచాయతీరాజ్ శాఖ పిఓపిఆర్డి, జాన్ కెనాడి పంచాయతీరాజ్ శాఖ ఏఈ ప్రతాప్ రావు, పోలీసులు కలసి శుక్రవారం వాహనాలను తనిఖీలు చేపట్టారు. మార్చి13వ తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు, ఎన్నికల కోడ్ ను ఉద్దేశించి వాహనాలలో తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. కోడ్ ముగిసేంత వరకు ఈ తనిఖీలు ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంబంధించిన అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.