ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో కొండములగాం మోడల్ స్కూల్, కోష్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం పనితీరున రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ రణస్థలం మండలం జెడ్పీటీసీ టొంపల సీతారాం గురువారం పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నది లేనిది వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని వంట చేసేటప్పుడు శుభ్రత జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం జే. సి. యస్ ఇంచార్జ్ చిల్లవెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ మైలపల్లి కామరాజు, మహంతి సత్యనారాయణ, ప్రధానోఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.