రణస్థలం మండలంలోని గురువారం సాయంత్రం ఎన్ఈఆర్ క్యాంపస్ లో బీజేపీ నియోజకవర్గం ఇంచార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొని తనకు మొదటి ప్రాధాన్యత ఓటు ను వేయవలసిందిగా అభ్యర్థించిన బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మల్సీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలుపునకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన తన పదవీ కాలం లో చేసిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణు గోపాలం , జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని గారు నాలుగు మండలాల నుండి విచ్చేసిన నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు పాల్గొన్నారు.