పశువులకు గాలి కుంట వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. గురువారం జమ్మలమడుగు మండల పరిధి పి బొమ్మేపల్లి గ్రామంలోని పశువులకు ఆయన టీకాలు వేయించి అనంతరం మాట్లాడారు. టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులు రాకుండా అరికట్టవచ్చునన్నారు. గ్రామాలలో ఈ నెల వరకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సుధాకర్ బాబు మోహన్ నాయక్, రాము సిబ్బంది పాల్గొన్నారు.